Category: తెలుగు

కాల బాణం

వలస పక్షి ఆగకుండా ఎగిరి - సముద్రాలు దాటి
అలసి సొలసి ఆశగా చేరి - తరు తీరానికి
గూడు కోసం ఆనాటి జాగా - ఎరుకలేని
మేటైన మిద్దెల శ్రేణుల వాసిగా - మూన్నెళ్లలో మారి
చూసి, అవాక్కై, నమ్మలేక - సంద్రమంత బాధతో
నాలుగు వలయాలు వేసి - కన్నీరు కరిపించి
ఊపిరి ఉగ్గవెట్టి - ఉసూరున ఎగిరి దిశలేక
మరో ఓటి జాగకై చూస్తూ - ఏరు దాటింది.

తరాల చిరునామా తెగిపొయింది. కాలం ఒక బాణం -
ముందుకేగాని, వెనక్కు సాగదదిగదా.

Continue reading

ప్రార్థన

శ్రీ
వినాయకం
విఘ్ననాశనం. భయ
విమోచం. జయ
విజయ వర దాయం.
విద్యార్థి మిత్రం
విమల దేవం,
వందే ప్రథమ పుత్రం.

  • తెలుగు సమయం కొఱకు, ౨౩ మార్చ్ ౨౦౨౪

Continue reading