వలస పక్షి ఆగకుండా ఎగిరి - సముద్రాలు దాటిఅలసి సొలసి ఆశగా చేరి - తరు తీరానికిగూడు కోసం ఆనాటి జాగా - ఎరుకలేని మేటైన మిద్దెల శ్రేణుల వాసిగా - మూన్నెళ్లలో మారిచూసి, అవాక్కై, నమ్మలేక - సంద్రమంత బాధతోనాలుగు వలయాలు వేసి - కన్నీరు కరిపించిఊపిరి ఉగ్గవెట్టి - ఉసూరున ఎగిరి దిశలేకమరో ఓటి జాగకై చూస్తూ - ఏరు దాటింది. తరాల చిరునామా తెగిపొయింది. కాలం ఒక బాణం - ముందుకేగాని, వెనక్కు సాగదదిగదా.